ఇంతకు ముందు రోజుల్లో అరవై ఏళ్ళు పైబడిన వారిలో గుండె లయ తప్పి మరణాలు సంభవించేవి.ఈ రోజుల్లో ముప్పై ఏళ్లకే గుండె లయ తప్పుతోంది.గుండె పోటు మరణాల్లో ఎక్కువ శాతం మన స్వయంకృతాపరాధమే.దీనికి మనలో అవగాహనా రాహిత్యమే కారణం.ఛాతీనొప్పి అనిపించగానే పొట్ట ఉబ్బరమేమో అనుకోకుండా వెంటనే అప్రమత్తమై వైద్యుని సంప్రదిస్తే యాబై శాతం మరణాలు అరికట్టవచ్చు.సంవత్సరానికి ఒకసారైనా గుండెకు సంబంధించి అన్ని పరీక్షలు చేయించుకోవాలి.శరీరం మొత్తం చేయించుకోగలిగితే మరీ మంచిది.చాలామంది సన్నగా ఉన్నామని కొలెస్టరాల్ పరీక్షలు మాకు అవసరం లేదు అనుకుంటారు.కానీ ముప్పై ఏళ్ళు పైబడిన దగ్గర నుండి కొలెస్టరాల్ తోపాటు బి.పి కూడా పరీక్ష చేయించుకోవాలి.మహిళలకు గుండె నొప్పి రాదు పురుషులకు మాత్రమే వస్తుంది అనుకుంటారు.అది కేవలం అపోహ మాత్రమే.గుండె ఎవరికైనా ఒకటే.దవడల నొప్పి,వెన్ను నొప్పి,ఆయాసం,పొట్టలో నొప్పి ఇవన్నీ గుండె నొప్పి లక్షణాలు.వీటిని అశ్రద్ద చేయడంతో గుండె లయ తప్పి మరణం సంభవిస్తుంది.గుండె పదిలంగా ఉండాలంటే చేపలు,గింజలు,తృణధాన్యాలు,ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉంటుంది.అవగాహనతో అప్రమత్తంగా ఉంటే ఎనభై శాతం మరణాలను అరికట్టవచ్చు.అద్దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకొంటామో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా గుండెను కాపాడుకోవాలి.అప్పుడు మనవళ్ళు,మనవరాళ్ళతో కూడా హాయిగా ఆడుకోవచ్చు.
No comments:
Post a Comment