Friday 11 October 2019

చలిగాడ్పులు

                                                                         సౌశీల్య యునైటెడ్ కింగ్ డమ్ వెళ్ళినప్పుడు ఎటు చూసినా పచ్చదనం,పెద్ద పెద్ద చెట్లను చూసి తెగ మురిసిపోయింది.వేసవి వెళ్లిన తర్వాత నుండి రోజూ సన్నగా వర్షంతో పాటు ఎండ ఉన్నా కూడా బయటకు వెళ్తే చాలు హోరుమంటూ చలి  గాలి వేస్తుంటుంది.చెవుల వరకు కోట్లు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి.ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కనుక ప్రతి ఒక్కళ్లు కారులో గొడుగులు పట్టుకెళ్లి దిగి వెళ్ళేటప్పుడు చేతిలో గొడుగు లు తీసుకుని వెళ్తుంటారు.సౌశీల్య కయితే మొదట్లో మన భారత దేశంలో తుఫాను వచ్ఛేటప్పుడు పిచ్చి గాలి వేసినట్లు హోరుమంటూ శబ్దం వస్తుందేమిటి? అనిపించింది.మన లాగా చెట్లయితే ఊగిపోవు కానీ శబ్దం మాత్రం అదే శబ్దం.సౌశీల్య కూతురు ఇక్కడ గాలులు సర్వ సాధారణం అమ్మా!ఒక్కొక్కసారి మనుషులు పైకి లేచిపోతారేమో అన్నంతగా వస్తాయి అని చెప్పింది.మనకు వడగాడ్పులు మాదిరిగా ఇక్కడ చలిగాడ్పులు అన్నమాట అనుకుంది సౌశీల్య.

No comments:

Post a Comment