Sunday 28 May 2017

పుచ్చపువ్వు

                                                            ఆద్య పదకొండు నెలల చిన్నారి.బుడిబుడి నడకలు నడుస్తూ పడుతూ లేస్తూ అప్పుడే పరుగెట్టడం మొదలుపెట్టింది.ఇంతలో మొదటి పుట్టినరోజు రానే వచ్చింది.వేరే దేశంలో ఉండటంతో బాబాయి,మేనమామలు ఆద్యను చూడటానికి రాలేకపోయారు. పుట్టినరోజుకు ఎట్టి పరిస్థితులలో రావాల్సిందేనంటూ ఆద్య తల్లిదండ్రులు పట్టుబట్టడంతో నానమ్మ,అమ్మమ్మ,తాతయ్యలు,బాబాయి,పిన్ని,మేనమామ,అత్త వేరే దేశాల నుండి ఆ సమయానికి వెళ్ళారు.ఆద్య ఆడుకుంటూ మధ్యమధ్యలో వెళ్ళి మేనమామ భార్యను సంబ్రమాశ్చర్యాలతో నిష్కల్మషంగా కళ్ళు విప్పార్చి పుచ్చ పువ్వులా మొహం ఇంత చేసుకుని ఎక్కడి కక్కడ  చూస్తూ నిలబడుతుంది.ఇదేంటి?ఈపిల్ల ఇలా చూస్తుంది అనుకుంది మేనమామ భార్య.సాయంత్రం ఆద్యకు కావాల్సిన బట్టలు కొనడానికి షాపింగ్ మాల్ కు అందరూ వెళ్లారు.అక్కడ కూడా తెల్లగా అందంగా ఉన్న శ్వేత జాతీయుల  దగ్గరకు వెళ్ళి అలాగే చూస్తుంటే వాళ్ళు ముద్దుగా ఉంది అంటూ మురిసిపోతున్నారు.ఆ వయసుకే ఆద్యకు అందం అంటే ఏమిటో తెలిసిందన్నమాట!

No comments:

Post a Comment