Sunday 7 February 2016

28 ఏళ్లకు ఒకసారి

                                                                      సోమవారం నాడు అమావాస్య,శ్రవణా నక్షత్రం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉంటే మహోదయ పుణ్యకాలం సంభవిస్తుంది.మహోదయ పుణ్యకాలం 28  ఏళ్లకు ఒకసారి వస్తుంది.మహోదయ పుణ్యకాలంలో నదీ స్నానం,సముద్ర స్నానం చేయటం మంచిది.నది సాగర సంగమమయ్యే ప్రాంతంలో పుణ్య స్నానాలు చేస్తే ఇంకా ఎంతో మంచిది.ప్రభుత్వం మహేంద్రతనయ నది సాగర సంగమ ప్రాంతం అయిన బారువలో మహోదయం ఏర్పాట్లు చేసింది.మహోదయ పుణ్యకాలం ఆదివారం రాత్రి 10.21 గం.ల నుండి 24 గంటల పాటు ఉంటుంది.ఈసమయంలో పుణ్యస్నానాలు చేయగలగడం ఎన్నోజన్మల పుణ్య ఫలం.అమావాస్య నాడు శివాభిషేకం,శివదర్శనం చాలా మంచిది.అమావాస్యలన్నింటిలోకి  ప్రత్యేకమైనది సోమవారం వచ్చేది.శ్రవణా నక్షత్రం  కూడా కలిస్తే అది మహోదయం.ఎంతో విశిష్టమైన ఈరోజు శివారాధన చేయటం అన్నివిధాల శ్రేయోదాయకం.

No comments:

Post a Comment