Monday 5 December 2016

స్నేహితురాలి సలహా

                                                                      వాణి,రాణి చిన్ననాటి స్నేహితురాళ్ళు.వాణి భర్త ఉద్యోగరీత్యా వేరే దేశంలో ఉంటుంది.సంవత్సరానికి ఒకసారి వచ్చి అందరినీ పలకరించి వెళ్తూ ఉంటుంది.ఒకసారి రాణిని కూడా చూచి పోదామని వచ్చింది.రాణి కంప్యూటర్ సైన్సు చదువుకుని ఉద్యోగం చేసుకుంటుంది.ఒంట్లో నలతగా ఉండి నాలుగు రోజులు సెలవు పెట్టడంతో ఇంట్లోనే ఉంది.రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం వలన నడుము,మెడ నొప్పి,చేతులు నొప్పి,కళ్ళు పొడిబారడం ఒకటేమిటి రకరకాల బాధలు చెప్పింది.రాణికి చిన్నప్పటి నుండి మందులు వేసుకోవాలంటే భయం.నీళ్ళు ఎక్కువ తాగితే మాటిమాటికి బాత్రూముకి  వెళ్ళాలని భయం.ఈ ఇబ్బందులు అన్నీ పోవడానికి ఏదయినా సలహా చెప్పు తల్లీ!అని వాణిని అడిగింది.ముందుగా నువ్వు అలవాట్లు మార్చుకుని నేను చెప్పే 15:15:15 సూత్రాన్నిపాటించు.అదెలాగంటే ఒక 15 సెకన్లు కంప్యూటర్ తెర వైపు చూడకు.కళ్ళు పొడిబారడం తగ్గుతుంది.ప్రతి 15 ని.లకు ఒకసారి లేచి మంచినీళ్ళు కొంచెం తాగి కంప్యూటర్ కు దూరంగా 15 అడుగులు వేస్తూ ఉండు.మద్య మద్యలో బొప్పాయి,జామ,ఒక నిమ్మజాతి పండు,కివి ఏదో ఒకటి పండ్ల ముక్కలు,దానిమ్మ గింజలు తింటూ ఉండు.ఆకుకూరలు,కూరగాయలతో సలాడ్లు,పిస్తా,బాదం,వాల్ నట్లు తింటూ ఉంటే పోషక పదార్ధాలు సరిపడా ఉండడంతో పాటు రక్తహీనత బారిన పడకుండా ఉంటావు.ఇంతకీ పెరుగు తినడం మాత్రం మర్చిపోవద్దు అని వాణి రాణికి సలహా ఇచ్చింది.నేను చెప్పిన విధంగా చేస్తే నీ ఇబ్బందులు చాలావరకు తగ్గటంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది అని చెప్పింది.

No comments:

Post a Comment