Thursday, 8 December 2016

పని దొంగ

                                                             అన్వేషిత ఈమధ్య వంటకు,ఇంట్లో పనికి ఒక పనికత్తెను పెట్టుకుంది.ఆమె పని చేసేకన్నా సొల్లు కబుర్లు చెప్పడంలో దిట్ట.అమ్మా!మీకు నేను చేసేవి నచ్చుతాయో నచ్చవోనని భయం వేస్తుంది అంటూ నాటకీయంగా మాట్లాడుతుంది.అందరూ భోజనానికి వచ్చే వేళ వరకు కాలక్షేపం చేసి అప్పుడు హడావిడి చేసి సగం పని అన్వేషిత చేసేలా చేస్తుంది.ఆమెను తెలిసిన వాళ్ళు పంపడంతో ఆమె చేసే పనులు నచ్చకపోయినా వద్దు అని చెప్పలేక పని చేయించుకోలేక అన్వేషిత సతమతమైపోతుంది.మనం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా పనిచేస్తుంది.ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయి.దొంగ భయం లేదు.ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పని చేస్తుంది  అని చెప్పడంతో పనిలో చేర్చుకుంది.అది అంతా సరే అనుకున్నా అసలు చేయాల్సిన పనులు చేయకుండా పని తప్పించుకుని యజమానులే పని చేసుకునేలా చేసే పెద్ద పని దొంగ.దొంగ బుద్ది ఉంటే ముందే జాగ్రత్త పడతాము.అంతే కానీ ఈపని దొంగను ఏ విధంగా దారిలోకి తీసుకురావాలో,వదిలించుకోవాలో అర్ధం కాక డబ్బు ఖర్చు అవడమే కాక పని సగం పైగా చేసుకోవాల్సి రావడంతో డబ్బూ పోయే శని పట్టే అని అన్వేషిత తల పట్టుకుంటుంది. 

No comments:

Post a Comment