Saturday 31 December 2016

స్వార్ధ ధోరణి

                                                                   ఒకప్పుడు చాలా కుటుంబాలలో అన్నదమ్ముల పిల్లలు,అక్కచెల్లెళ్ళ పిల్లలు అందరూ కలిసి కట్టుగా ఉండేవారు.ఈరోజుల్లో ఒకళ్ళు ఇద్దరే సంతానం ఉంటున్నాఎవరికి వాళ్ళు నేను బాగుంటే చాలు తోడబుట్టిన వాళ్ళు ఎలా ఉన్నా నాకు అనవసరం అన్నట్లు కొందరు మితిమీరిన స్వార్ధంతో ఆలోచిస్తున్నారు.తల్లిదండ్రులు కూడా నన్ను మాత్రమే చూడాలి నాకు,నా పిల్లలకు చాకిరీ చెయ్యాలి వాళ్ళను మాత్రమే చూచి మురిసిపోవాలి అనుకుంటున్నారు.కొంతమంది చిన్నవాళ్ళ బాగోగులు ప్రేమతో బాధ్యతగా చూస్తున్నారు.కానీ ఎక్కువమంది చిన్న వాళ్ళు లేకపోతే ఆస్తి మొత్తం మేమే తినే వాళ్ళం అన్నట్లు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు.చదువు సంస్కారం నేర్పుతుంది అన్నది ఒకప్పటి మాట ఇప్పుడు  చదువుకుని ఎవరి సంపాదన వారికి  ఉన్నా అదే స్వార్ధ ధోరణి. 

No comments:

Post a Comment