అఖిల అమెరికాలో ఉన్నకూతురు ఇంటికి వెళ్తూ రకరకాల పచ్చళ్ళు తీసుకుని వెళ్ళింది.అందులో రొయ్యల పచ్చడి కూడా ఉంది.అఖిల కూతురు ఆద్య ఐదేళ్ళ కొడుకు ఆర్యకు శాండ్ విచ్ లో రొయ్యల పచ్చడి పెట్టి ఇచ్చింది.ఆర్య అది తిని చాలా బాగుందని అమ్మమ్మా!నువ్వు తెచ్చిన బబుల్ గమ్ పచ్చడి నాకు బాగా నచ్చింది అని చెప్పాడు.ఆర్య మాటలకు అఖిల నవ్వి అది బబుల్ గమ్ పచ్చడి కాదు కన్నా!రొయ్యల పచ్చడి అంటే వినడు.అది నమిలితే బబుల్ గమ్ లాగే ఉంది నేను అలాగే అంటాను అమ్మమ్మా అన్నాడు.ఆ మాటలకు అఖిల ఈ రోజుల్లో పిల్లలకు చెప్పలేకుండా ఉన్నాము అంటూ విస్తుపోయింది.
No comments:
Post a Comment