ఆడవాళ్ళకు జుట్టు ఒత్తుగా,నల్లగా,నిగనిగలాడుతుంటే ,ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.అందుకే మనం జుట్టు రాలకుండా ఆరోగ్యంగా అందంగా ఉండేలా కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.వారానికి ఒకసారి మూడు స్పూనుల గోరింటాకు పొడి,మూడు స్పూనుల కరివేపాకు పొడి,ఒక స్పూను మందారఆకుల పొడి,సరిపడా పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో,గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా నల్లగా వస్తుంది.
No comments:
Post a Comment