కారణాలు ఏవైనా ఒక్కొక్కసారి విపరీతమైన చిరాకు,కోపం,అసహనం,ఏదో తెలియని ఆందోళన,ఏపనీ చేయలేనీ పరిస్థితి.ఇలాంటి పరిస్థితికి కారణం తీవ్రమైన ఒత్తిడికి గురి కావడమే.ఎదురుగా వచ్చిన వాళ్ళు ఎండిపోతారు అన్నట్లుగా కొంతమంది అనవసరంగా ఎదుటివాళ్ళపై విరుచుకుపడిపోతుంటారు.అది తప్పాఒప్పా అని కూడా ఆలోచించే స్థితిలో ఉండరు.అనవసరంగా అపార్దాలు,అపోహలు. అటువంటి సమయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి.రంగు రంగుల గాలి బుడగలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని నోటితో వాటిలో గాలి నింపాలి.ఇలా చేయడం వల్ల దీర్ఘంగా శ్వాస తీసుకోగలిగి ఒత్తిడి దానంతటదే తగ్గిపోతుంది.వీటిని గాల్లోకి వదిలి పగలగొట్టి సరదాగా చిన్నపిల్లల్లా కాసేపు ఆడుకుంటే మనసుకు సంతోషంగా ఉండడమే కాక మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.
No comments:
Post a Comment