భావవ్యక్తీకరణకు తెలుగు భాషను మించిన మధురమైన భాష మరొకటి లేదు.తేనెలూరే మధురమైన,కమ్మనైన భాష తెలుగు.ఏ ప్రాంతానికి,ఏదేశానికి వెళ్ళినా మన మాతృభాషను మర్చిపోకూడదు.పొరుగు రాష్ట్రాలకు వెళితే మనం ఏభాష మాట్లాడినా వాళ్ళు మాత్రం వాళ్ళ మాతృ భాషలోనే సమాధానం చెప్పి మాతృభాషపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు.ఇతర భాషలు అవసరం రీత్యా ఎన్ని నేర్చుకున్నామాతృ భాషను విస్మరించకూడదు.ఏదేశంలో ఉన్నా పిల్లలకు మాతృభాష తప్పకుండా నేర్పాలి.మన దేశంలో ఉన్న పిల్లలకే తెలుగు సరిగా రావటం లేదు.కనుక ప్రతి ఒక్కరు తమ పిల్లలకు మాతృ భాషపై పట్టు ఉండేలాచూడాలి.
.
అన్న నానుడిని నిజమని నిరుపించాలి పర భాషా వ్యామోహం ఉన్నా తెలుగు భాషను పరిరక్షించి తెలుగుకు వెలుగునిద్దాము.
No comments:
Post a Comment