చిక్కటి పాలు - 2 కప్పులు
మొక్కజొన్న పిండి - 3 టేబుల్ స్పూనులు
లేలేత కొబ్బరి - 1 కప్పు
కొబ్బరి నీళ్ళు - 1/2 కప్పు
ముందుగా పాలు,పంచదార కలిపి ఒక గిన్నెలో పోసి చిన్న మంటపై గరిటెతో
మొక్కజొన్న పిండి - 3 టేబుల్ స్పూనులు
పాలపొడి - 1 1/2 కప్పు
పంచదార - 1/2 కప్పు
క్రీమ్ - 1 1/2 కప్పులేలేత కొబ్బరి - 1 కప్పు
కొబ్బరి నీళ్ళు - 1/2 కప్పు
ముందుగా పాలు,పంచదార కలిపి ఒక గిన్నెలో పోసి చిన్న మంటపై గరిటెతో
కలుపుతూ మరిగించాలి.పాలు మరిగిన తర్వాత 1/2 చల్లటి పాలల్లో మొక్కజొన్న పిండి వేసి మరిగిన పాలల్లో కలిపి గడ్డలు కట్టకుండా త్రిప్పుతూ ఉండాలి.స్టవ్ కట్టేసి గోరు వెచ్చగా అయ్యేవరకు చల్లార్చాలి.పాలపొడి వేసి బాగా కలిపాలి.
దీన్ని గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రీజర్ లో4- 5 గం.లు ఉంచాలి.తర్వాత గడ్డకట్టిన పాల పదార్ధము తీసి10-20 సెకన్లు ఓవెన్లో పెట్టాలి.కొద్దిగా కరిగిన తర్వాత దీన్ని పెద్ద గిన్నెలో వేసి కొబ్బరినీళ్ళు,లేత కొబ్బరి,క్రీమ్,వేసిబాగా కలపాలి.దీన్ని బీటర్ తో 10 ని.లు వేగంగా గిలకొట్టాలి.అప్పుడు బాగా నురగ వచ్చి పదార్ధం 3 రెట్లు అదికంగా పెరుగు తుంది.దీన్ని మరల గాలి చొరబడని డబ్బాలో వేసి పల్చటి మైనపు పొర వేసి మూతపెట్టాలి.దీన్ని మరల ఫ్రీజర్ లో7-8 గం.లు ఫ్రీజర్ లో పెట్టాలి.నోరూరించే లేలేత కొబ్బరి ఐస్ క్రీమ్ తయారయినట్లే.కావాలనుకుంటే ఎండు ఫలాలను ముక్కలు కత్తిరించి అందంగా అలంకరించి తినవచ్చు.
No comments:
Post a Comment