శ్రావ్య కుటుంబ సభ్యులందరికీ ప్రకృతి సిద్ధంగా వచ్చిన పుట్టగొడుగులు అంటే చాలా ఇష్టం.వర్షాలు పడటం మొదలైన దగ్గర నుండి రెండు నెలలవరకు విరివిగా దొరుకుతాయి.ఒకవేళ వాళ్ళ ఊరిలో దొరకకపోయినా వేరే ఊరి నుండి తెప్పించి మరీ తినేవాళ్ళు.అలాంటిది ఉద్యోగరీత్యా వేరే నగరానికి వెళ్ళటంతో అక్కడ కృత్రిమంగా పండించినవి తప్ప దొరికేవికాదు.వాటి రుచి వీళ్ళకు నచ్చక తినేవాళ్ళు కాదు.అలా తొమ్మిది ఏళ్ళు గడిచిన తర్వాత స్వంత ఊరికి రావటంతో మళ్ళీ పుట్టగొడుగులు కనిపించడంతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. కాకపోతే బరువు తగ్గే కార్యక్రమంలో భాగంగా చిక్కి శల్యమైనట్లు అంతకుముందు కట్టలో 1/4 భాగమే రెట్టింపు ధరకు కొనుగోలు చేయవలసి వచ్చింది.అయినా తొమ్మిది ఏళ్ళతర్వాత పుట్టగొడుగులు దొరకటమే మహద్భాగ్యంగా భావించి వాటిని కొనుగోలు చేసి ఎంతో ఇష్టంగా తృప్తిగా తిన్నారు.
No comments:
Post a Comment