Tuesday, 18 August 2015

నడకకు వెళ్ళాలంటే........

                                                 ఉదయం నడకకు వెళ్ళాలంటే స్నేహితులతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ,హాస్యాన్ని పండిస్తూ,హాయిగా నవ్వుకుంటూ తెల్లవారుఝామున 4 గం.ల నుండి 6 గం.ల లోపు వెళ్ళటం మంచిది.ఎందుకంటే హాయిగా నవ్వటం కూడా ఒక వ్యాయామమే.వాహన కాలుష్యం ఉండదు.ఖాళీ కడుపుతో నడవటం వలన త్వరగా క్యాలరీలు ఖర్చు అవుతాయి.చల్లటి వాతావరణంలో వాహనాల రణగొణ ధ్వనులు లేకుండా ఎంతో  హాయిగా చకచకా నడక తేలికగా సాగుతుంది.స్వచ్చమైన గాలి పీల్చుకోవచ్చు.అప్పుడు మనసులో ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.

3 comments:

  1. ఉదయం spiceandhra చదవండి గొప్ప online తెలుగు న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.

    ReplyDelete
  2. తెల్లవారుఝామున నాలుగు గంటలకే - పోనీ అయిదు గంటలకైనా (ఏదైనా గాని, తెల్లవారక ముందే అని నా భావం) - నడక కి వెళ్ళడం ఆరోగ్యరీత్యా మంచిదేమో గాని భద్రత దృష్ట్యా ఏమాత్రం అభిలషణీయం కాదు. వీధికుక్కల బెడద, ట్రాఫిక్ తక్కువతో రోడ్ ఖాళీగా ఉందని వెర్రి స్పీడుగా వెళ్ళే ఆ కొద్ది పాటి వాహనాలు (పాల వాన్లు, న్యూస్ పేపర్ వాన్లు, కాబ్లు, వగైరా), మసక చీకట్లో అసాంఘిక శక్తులనుంచి ఇబ్బంది; ఆ టైములో ఆడవారికైతే మరీ ప్రమాదకరం - గొలుసు అపహరణలు, కిడ్నాపులు జరిగినట్లు పేపర్లలో వార్తలు చదివాను గతంలో. నడక వ్యాయామం చెయ్యాల్సిందే, కానీ కొంచెమైనా తెల్లవారిన తర్వాత వెళ్ళడమే క్షేమకరం అని నా అభిప్రాయం (అందుబాటులో ఉంటే ఏదైనా పార్కులోనో, గ్రౌండులోనో అయితే మరీ మంచిది).

    ReplyDelete
  3. మీరన్నట్లు భద్రతకే ముందు ప్రాముఖ్యత ఇవ్వాలి.ఒక్కరే వెళ్తే మీరు చెప్పిన సమస్యలు ఉండొచ్చు.ఈ రోజుల్లో ఆడవాళ్లు,మగవాళ్ళు కూడా స్నేహితులతో కలిసే నడకకు వెళ్తున్నారు.జేబులోనో,చేతిలోనో ఫోను లేనిదే ఎవరూబయటకు వెళ్ళటం లేదు.అవసరమైతే ఎవరినైనా ఎదుర్కునేలా ఉండాలి.నడుస్తూనే చుట్టుప్రక్కల అంతా ఒక కంట గమనిస్తుండాలి.కుక్కలు ఎక్కువ ఉంటే మున్సిపాలిటీ వాళ్ళకు ఫిర్యాదు చెయ్యాలి.ఏదో జరుగుతుందని బయటకు వెళ్ళకుండా ఉండలేరు కదా!ప్రతి కాలనీలో పార్కు,స్కూలు మైదానం ఉండనే ఉంటుంది.పెప్పర్ స్ప్రే లాంటివి ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి.మహిళలకు కూడా కరాటే నేర్పిస్తున్నారు.ప్రతి ఒక్కళ్ళు స్వీయ రక్షణకు అవసరమైనవి తప్పనిసరిగా నేర్చుకోవాలి.ఎవరో వచ్చి ఏదో సహాయం చేయాలని అనుకోకుండా ఎవరికీ వారే ధైర్యంగా తమను తామే రక్షించుకోవాలి.అవసరమైతే ఇతరులకు కూడా సహాయపడేలా ఉండాలి. చిన్నప్పటి నుండి పిల్లలకు కూడా అదే నేర్పాలి.స్వీయ రక్షణకు ఎన్నోయాప్స్ కూడా వచ్చాయి.కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవాలి.

    ReplyDelete