మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ముఖం,మేడ,చేతులపై కనిపించని దుమ్ము వల్ల మురికి పేరుకుపోతుంటుంది.అందుకని అప్పుడప్పుడు నాలుగు అంగుళాల కలబంద ముక్క తీసుకుని దానిలోని గుజ్జు, ఒక స్పూను తేనె,2 స్పూనుల పెరుగు,2 స్పూనుల పళ్ళ రసం(ద్రాక్ష తప్ప) ఏదైనా కలిపి వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా చేసి ముఖానికి,మెడకు,చేతులకు పట్టించి పావుగంట తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో కడిగేయాలి.ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం శుభ్రంగా తయారయి మెరుస్తూ కళకళలాడుతూ ఉంటుంది.
No comments:
Post a Comment