Sunday 1 January 2017

పబ్బం

                                                                    వంశీ కృష్ణ ఏకాస్త సమయం దొరికినా రెండు రాష్ట్రాల మధ్య బొంగరంలా తిరుగుతుంటాడు.ఇంతకు ముందు ఒక్కడే తిరిగేవాడు.ఇప్పుడు కుటుంబం మొత్తాన్ని వెంటేసుకుని తిరగటం మొదలెట్టాడు.తన డబ్బు ఖర్చు అవకుండా ఎవరో ఒకరి ఇంటి మీద కాకి మాదిరిగా వాలిపోతుంటాడు.కొద్ది పరిచయం ఉన్నా వెళ్తుంటాడు.ఒకటి రెండు సార్లు అయితే  ఫర్వాలేదు.నలుగురం వస్తున్నామని చెప్పి పది మందిని వెంట తీసుకుని పెళ్లిళ్లకు,పేరంటాలకు వస్తుంటాడు.పోనీ ఇన్నిసార్లు ఎదుటి వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నామని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం ఉండదు.పైగా ఒకచోటు నుండి ఇంకొకచోటుకు వచ్చేదారిలో ఏమైనా తింటే డబ్బు దండుగ అని ఎక్కడా ఆగకుండా కారులో రావటం వంశీ కృష్ణ మధ్యలో దిగి మిగతావాళ్ళను పంపటం ఆ వచ్చిన వాళ్ళు  రాగానే అంత మందికి భోజన ఏర్పాట్లు ఒక్కరే చెయ్యడం కష్టం అనే ఆలోచన లేకుండా ఆకలి ఆకలి అంటూ 11 గం.లకే భోజనం పెట్టమనడం పెద్ద తలనొప్పి.మేము ఆ కూర తినము ఈ కూర తినము అంటూ విసిగించడం తినేసి హాయిగా ఏ.సి వేసుకుని పడుకోవడం లేచి కాఫీ కావాలని ఒకళ్ళు టీ కావాలని ఒకళ్ళు పీక్కుని తినడం వీళ్ళందరికీ చాకిరీ చేయలేక చేసి ఈ తలనొప్పితో ఇంటి ఆమె పెళ్ళికి వెళ్ళలేకపోవడం అవేమీ తనకు సంబంధం లేనట్లు తన పబ్బం గడిస్తే చాలన్నట్లు తన పరివారాన్ని వెంటేసుకుని వెళ్ళిపోవడం గొప్పగా భావిస్తుంటాడు.తన గొప్ప ఏమో గానీ ఎదుటివాళ్ళ మనసులో భావన (చులకన) ఏంటో?వంశీ కృష్ణకు అనవసరం.

No comments:

Post a Comment