Wednesday, 18 January 2017

రాలిపోనీకండి

                                                                                  ఏ చిన్నశబ్దం రాకుండా పుల్ల కూడా విరగదు.చివరకు ఆకు రాలినా భూమి మీద రాలినప్పుడు శబ్దం వస్తుంది.ఏమాత్రం అశ్రద్ధ,నిర్లక్ష్యంగా ఉన్నట్లనిపించినా బయటకు కూడా తెలియకుండానే మనసులు విరిగిపోయి బంధాలు తెగిపోతాయి.ఇవి చాలా చాలా సున్నితమైనవి కనుక వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.అవేమిటంటే అనుబంధాలు,ఆప్యాయతలు వాగ్దానం ఇచ్చి నిలుపుకోలేకపోవడం లబ్ది పొంది కనీస కృతజ్ఞత లేకుండా వెన్నుపోటు పొడవడం ఇవి మనసుకు  కష్టం కలిగించి  ఏ మాత్రం శబ్ధం రాకుండా అనుబంధాలు,ఆప్యాయతలు పుటుక్కున తెగిపోయి అవి  కృత్రిమంగా తయారయ్యే  ప్రమాదం ఉంది.ఏ కొంచెం తేడా వచ్చినా హృదయ పూర్వకంగా ప్రేమతో కూడిన మాటలు రాకుండా పెదవుల చివర నుండి పైపై  మాటలు వచ్చేస్తాయి. అందుకే జీవితంలో వీటిని ఎప్పటికీ రాలిపోనీకండి.          

1 comment:

  1. nice
    Hi
    We started our new youtube channel : #Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

    ReplyDelete