ఓం శ్రీ సాయినాధాయనమః
జయంతమ్మ సాయి పుట్టినరోజునాడు సంతోషంగా వ్రాసుకున్న సాయి సంకీర్తనా కుసుమంషిరిడీ సాయి పుట్టినరోజు మన అందరికీ పండుగరోజు
త్యాగం,సహనం పుట్టినరోజు భూమాత పులకించిన రోజు "షి"
అందరిలో నీరూపం సృష్టికి నీవే మూలం
జగతికి నీవే ఆధారం చిత్రమయా నీ వ్యవహారం"షి"
తల్లిదండ్రులు లేని వాడవా నీవెవరో మాకు తెలియదా
పిల్లలున్న ప్రతి జంటా నీకు తల్లి తండ్రులే కదా! "షి"
ఇంటింటా నీ నామమే ప్రతి అణువు నీ రూపమే
సాయి మేమంతా నీ పాద దాసులమే కదా! "షి"
పశువులతో నీ సావాసం పక్షులతో నీ భాషణం
పంచభూతములు నీ స్వాధీనం కలియుగమందున వెలసిన దైవం "షి"
No comments:
Post a Comment