Tuesday 31 January 2017

ఆమె అదృష్టం

                                                                    రాకేశ్,రాగిణి వేంకటేశ్వరుని కళ్యాణోత్సవానికి వెళ్లారు.అక్కడ పెద్ద మధ్య,పిన్న వయస్సు దంపతులు చాలా మంది ఉన్నారు.కళ్యాణం మొదలుపెట్టడానికి మూడు గంటల ముందు రమ్మని చెప్పడంతో అందరూ వచ్చి కూర్చున్నారు.ఇంకొక అరగంట,పావుగంట అంటూ నిర్వాహకులు చెప్పడంతో పెద్దవాళ్ళు కూర్చోలేక ఆపసోపాలు పడుతూ ఉన్నారు.ఎదురు చూడగాచూడగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని కళ్యాణం కన్నులపండుగగా మొదలైంది.చూడటానికి రెండు కళ్ళు చాలవన్నట్లు చాలా నిశ్శబ్దంగా కూర్చుని దాదాపు 1500 మంది ఎంతో ఆసక్తిగా కల్యాణాన్ని తిలకించారు.కల్యాణోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది.అప్పుడే అసలు ఘట్టం మొదలైంది.ఒక గంట మాత్రమే స్వామివారి అక్షింతలు వేసి పెద్దాయన ఆశీస్సులు అందజేస్తారు ఎక్కడివాళ్ళు అక్కడే కూర్చోండి అని ప్రకటించారు.ఎక్కడ తమకు అవకాశం రాదోనని వెనుక నుండి ఒక్కసారిగా ముందు వాళ్ళను తోసుకుని వచ్చేశారు.తోపులాటలో ఒక పెద్దాయన భార్య కనిపించలేదు.ఆయన ఒక్కసారిగా బిక్కమొహం పెట్టి ఏడుపు ఆపుకుంటూ భార్య కనిపించలేదన్న భాధతో దాదాపు ఐదు గంటలు కూర్చున్నాము ఒక్క అరగంట కుర్చోలేమా?స్వామి దర్శనానికి వచ్చి తోపులాటలు ఏమిటి?మనలో మార్పు ఎప్పటికి వస్తుంది?అంటూ తన భార్య కోసం కంగారు పడుతున్నాడు.పక్కనే ఉన్న రాకేశ్ కంగారు పడకండి అందరూ ఇక్కడే ఉన్నారు ఎవరూ బయటకు వెళ్ళలేదు.ఆమె ఇక్కడే ఉండొచ్చుఅని చెప్పగానే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు.ఒక పది ని.లకు ఇదిగో నా భార్య అని సంతోషంగా చాటంత మొహం చేసుకుని చెప్పాడు.భార్య అంటే ప్రేమ అందరికీ ఉంటుంది.కానీ ఆయనకు తన భార్య అంటే ఉన్న ప్రేమ ఆయన  కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది.అది ఆమె అదృష్టం.

No comments:

Post a Comment