ఉల్లిగడ్డలు ముక్కలు కోసేటప్పుడు కొంతమందికి ధారాపాతంగా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి.ఆకన్నీళ్ళతో పాటు ముక్కులో నుండి కూడా నీళ్ళు కారిపోతుంటాయి.ఇంతకు ముందు రోజుల్లో అయితేమన కంట్లో ఏదైనా దుమ్ము,ధూళి ఉంటే ఆకన్నీళ్ళతో పాటు కొట్టుకుపోతాయని సరిపెట్టుకునేవాళ్ళు.ఇప్పుడు రోజూ ఇబ్బంది పడకుండా,ముక్కలు కోసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఈ చిట్కాలు.
1)ఉల్లిపాయలు 1/2 గంట ముందు నీళ్ళల్లో వేస్తే కళ్ళవెంట నీళ్ళు రావు.2)ఉల్లిపాయలు కోసేటప్పుడు ఫ్యాన్ తిరుగుతుంటే కోసేవాళ్ళకే కాక చుట్టూ, ఇంట్లో అందరికీ కూడా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి.అలా రాకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ ముక్కలమీద చల్లితే చుట్టూ ఉన్నవాళ్ళకు,కట్ చేసేవాళ్ళకు కూడా కళ్ళవెంట నీళ్ళు రాకుండా ఉంటాయి.
3)ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళే మహిళలకు ఉదయమే అన్ని పనులు కష్టం కనుక ఉల్లిపాయలు తరిగి ముందురోజు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉల్లి ముక్కలతోపాటు ఒక నిమ్మకాయ సగానికి కట్ చేసి పెడితే వాసన బయటకు వ్యాపించకుండా ఉంటుంది.4,5 రోజులు తాజాగా ఉంటాయి.సమయం ఆదా అవుతుంది.
నేను బ్యాచ్ లర్ని.జాబ్ మీద వేరే చోట సింగిల్ గా ఉంటున్నాను.హోటల్ ఫుడ్ తినబుద్ది కాక స్వంతంగా స్వయపాకం మొదలు పెట్టా.కర్రీ తయారికి ఉల్లిగడ్డలు తరగాలంటే ఒకటే భయం.కళ్లంతా మంటలు,నీళ్లు.మంచి విషయం తెలియజేసారు.అమలులో పెడతాను ఇందుగారు.థ్యాంక్యూ వెరీ మచ్.
ReplyDeletehttp://ahmedchowdary.blogspot.com/
:-) అలాగే అమలులో పెట్టండి.
Deleteప్రస్తుతం ఉల్లిలో అంత పవర్ ఎక్కడుందిలే....రేటు తప్ప :-)
ReplyDeleteఉల్లి ఘాటు కన్నా రేటు ఘాటు ఎక్కువైనా ఉల్లి సహజ లక్షణం పోదు కదా!
Delete