గంగా భాయల్ ఆకు - 4,5 కట్టలు
పచ్చిమిర్చి - 7,8
నువ్వులు - 1 టీ స్పూను
పల్లీలు - 10
టొమాటో - 1 ఉప్పుతగినంత
జీరా - 1 స్పూను
చింతపండు - కొంచెం
నువ్వులు,పల్లీలు నూనె లేకుండా వేరువేరుగా వేయించుకోవాలి.కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి వేయించి తీసేసి,తర్వాత టొమాటో వేయించిప్రక్కన పెట్టుకోవాలి. ఆకు విడిగా వేయించుకోవాలి.నువ్వులు,పల్లీలు,జీరా అన్నీ మెత్తగా రోటిలో దంచి పచ్చిమిర్చి,చింతపండు,ఉప్పు నూరి టొమాటోవేసి నూరి,చివరగా వెల్లుల్లి,ఆకు వేసి నూరాలి.
దీనికి తాలింపు పెట్టిన తర్వాత ఒకపెద్ద ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేయించి కలిపితే చాలా రుచిగా ఉంటుంది.
గమనిక :ఈఆకు అన్నిచోట్ల దొరకదు. పప్పులోచింతపండు వెయ్యకుండా టొమాటోలు,ఉల్లి,పచ్చిమిర్చి వేసి ఈఆకు వేసి వండి తాలింపు పెడితే ఎంతో రుచిగా వుంటుంది.అన్నం,చపాతీలోకి బాగుంటుంది.
No comments:
Post a Comment