వెన్నెలను చూడగానే అస్మితకు తనబాల్యం గుర్తొస్తుంటుంది.వెన్నెల్లో తమ్ముడు,స్నేహితులతో కలిసి
ఆడిన ఆటలు గుర్తొస్తాయి.ఇంట్లో అందరూ సమావేశమై ఆరుబయట వెన్నెల్లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవటం గుర్తొస్తుంటుంది.ముఖ్యంగా అమ్మ,అమ్మమ్మ వేడివేడి అన్నంలో వెన్నపూసవేసి,కొత్తఆవకాయ కలిపి అస్మితకు,
తమ్ముడికి వెన్నెల్లో గోరుముద్దలు తినిపించటం మరీమరీ గుర్తొస్తుంటుంది.ఆరుచి,ఆఅనుభూతే వేరు.ఇప్పటి బిజీ
లైఫ్ లో వెన్నెల గురించి అలోచించే తీరిక కూడా ఉండదు.ఏ హోటల్ వాళ్ళో,క్లబ్ వాళ్ళో వ్యాపార లాభాలకోసం వెన్నెల్లో డిన్నర్ అంటూ ప్రకటనలిస్తేగానీ వెన్నెల గొప్పతనం పెద్దలకు,పిల్లలకు తెలియదు.

No comments:
Post a Comment