రోజు కాసేపు ధ్యానం చేయడం మంచి అలవాటు.ధ్యానం వల్ల ఏకాగ్రత,జ్ఞాపకశక్తి పెరుగుతుంది.ఏసమస్యనైనా ఎదుర్కోగల పరిణతి పెరుగుతుంది.అనవసరమైన ఆలోచనలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.రక్తప్రసరణ వేగంతగ్గి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.తెల్లవారుజామున చేసుకోగలిగితే వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.నిశ్శబ్దంగాఉన్నప్రదేశంలోనిటారుగా,నిశ్చింతగా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మనసు త్వరగా లగ్నమౌతుంది.ఏదైనా ఆసనం వేసుకుని కానీ,బాసింపట్టు కానీ,అదీ కుదరకపోతే కుర్చీలో కూర్చునైనా చేసుకోవచ్చు. శ్వాస ఎంత సుదీర్ఘంగా,నిదానంగా ఉంటే ధ్యానం అంత ప్రభావంగా ఉంటుంది.ధ్యానం చేసేటప్పుడు భగవన్నామాన్నికానీ,ఓంకారాన్నిజపించవచ్చు.దేవుడి రూపాన్నికానీ,అందమైన ప్రకృతిని కానీ ఊహించుకోవచ్చు.ధ్యానం చేసేటప్పుడు బలవంతంగా కళ్ళుమూసుకుని కుర్చోవద్దు.ఒక్క పది ని.లు.కేటాయించి ధ్యానం చేసుకుంటే మెదడులోని కణాలు చురుగ్గా పనిచేసి రోజంతా హుషారుగా ఉండగలం.
No comments:
Post a Comment