శిరీష్ ఇంటికి ఆమడ దూరంలో మంచినీళ్ళ చెరువు ఉంది.ఆ చెరువులో చిన్నచిన్న చేపలు
ఉంటాయి.వాటిని తినటం కోసం కొంగలు వస్తుంటాయి.శిరీష్ పిల్లలు ఎప్పుడన్నా సరదాగా చేపలు పట్టటానికి
వెళుతుంటారు.ఒకసారి అనుకోకుండా ఏదోపక్షి ఆకాశంలో ఎగురుతూ సరయను తీసుకుని వెళ్తుండగా మధ్యలో వదిలేసింది.అప్పుడు సరయ క్రింద తోటలోఉన్నశిరీష్ పాలేరు తలపై పడింది.సరయ అంటే తాబేలు.దాన్ని
తీసుకొచ్చి పిల్లలకు ఇచ్చాడు.అదేసమయంలో చెరువులోనుండి దారితప్పి రెండు చిన్నతాబేళ్ళు నడుచుకుంటూ శిరీష్ ఇంటివైపు వచ్చాయి.వీటన్నింటినీ కలిపి పిల్లలు ఒక నాచుపట్టిన తొట్టిలో వేశారు.అవి దానిలోఉన్ననాచు మొత్తం తినేశాయి.ఒకరెండు రోజులు పిల్లలు వాటితో ఆడుకున్నాక మళ్ళీ చెరువులో వదిలేయమంటే పాలేరు వదిలేశాడు. ఇంతకు ముందు రోజుల్లో నీళ్ళ టాంకులు కడగటానికి శ్రమపడటం ఎందుకని తాబేలును తెచ్చి వేసేవాళ్ళు.అది టాంకులోని ఆకుపచ్చని పదార్ధన్నంతా తినేసి నీట్ గా చేసేది.తర్వాత చెరువులో వదిలేసేవాళ్ళు.

No comments:
Post a Comment