పచ్చి కారం(ఎండుమిర్చికారం) - 3 గిద్దలు (3 రైస్ కుక్కర్ గ్లాసులు)
ధనియాలు - 1 1/2 గిద్దలు 1 1/2 కుక్కర్ గ్లాసులు
మెంతులు - 1/2 కుక్కర్ గ్లాసు
జీరా - 1/2 కుక్కర్ గ్లాసు
ఉప్పు - 1 కుక్కర్ గ్లాసు
పసుపు - 2 టేబుల్ స్పూనులు
నూనె - చిన్న గ్లాసు
వెల్లుల్లి - 5 పెద్దవి
ముందుగా ధనియాలు వేయించి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.మెంతులు మంచి వాసన వచ్చేట్లుగా వేయించి మెత్తగా పొడిచేసుకోవాలి.జీరా కూడా వేయించి పొడి చేయాలి.వెల్లుల్లి పైపొట్టు తీసి మిక్సీలో
కొద్దిగా నలిగేట్లుగా చేయాలి.ఇవన్నీ ఒక బేసిన్లో వేసి కారం కూడా కొద్దిగా త్రిప్పుతూ గోరువెచ్చగా వేడిచేసి బేసిన్లో
వేయాలి.ఉప్పు,పసుపు,నూనె కూడా వేసి పొడిగా ఉన్న గరిటెతో కానీ,తడిలేకుండా చేత్తోకానీ బాగా కలపాలి.
కొద్దిగా ఆరినతర్వాత తడిలేని సీసాలోకానీ,ప్లాస్టిక్ డబ్బాలో కానీ వెయ్యాలి.ఉప్పు వేస్తాం కనుక స్టీల్ డబ్బాలో వేయకూడదు.ఇది అన్నికూరల్లో వేస్తే అదనపు రుచి వస్తుంది.ఒకసారి కొంచెం శ్రమ పడితే మన వాడకాన్ని బట్టి
నెలో,రెండు నెలలో వస్తుంది.వెజ్,నాన్ వెజ్ కర్రీస్ కి కూడా బాగుంటుంది.పచ్చికారం డైరెక్ట్ గావాడుకునే కన్నా
ఇది చాలాబాగుంటుంది. ప్రయత్నించండి.తేడా మీకే తెలుస్తుంది.అప్పడాలు,వడియాలు,అప్పడపు పూలు,కార్న్ ఫ్లేక్స్ వేయించినప్పుడు ఈ కారం కొంచెంచల్లితే స్పైసీగా బావుంటాయి.ఉప్పు వేయనవసరం లేదు.

No comments:
Post a Comment