కాంతమ్మకు పెళ్ళయి ఎన్నిసంవత్సరాలయినా పిల్లలు లేరు.ఒకవేళ గర్భం దాల్చినా నిలబడేది కాదు.
ఎప్పుడైనా పిల్లలు పుట్టినా పురిట్లోనే చనిపోయేవారు.ఎట్టకేలకు పదకొండు సంవత్సరాల తర్వాత ఒక మగబిడ్డ
పుట్టాడు.చాలా బలహీనంగా పుట్టాడు.వీడు కూడా చనిపోతాడేమోనని చాలా కంగారుపడ్డారు.కొద్దికాలం క్రితం
పిల్లలు బ్రతకకుండా చనిపోతుంటే ఏదో ఒక పిచ్చిపేరుతోనో లేక వింతపేరుతోనో పిలిచేవాళ్ళు.అందుకని కాంతమ్మ
కొడుకును సన్నగా ఉన్నాడనే వంకతో పీచు,పీచాయ్ అంటూ పిలిచేవాళ్ళు.అతనికి పెళ్ళయి అమ్మాయిపుట్టి ఆపిల్లకు పెళ్ళయినా కూడా ఆ ఊరివాళ్ళు,స్నేహితులు కూడా పీచాయ్ అనే పెట్టుడు పేరుతో పిలుస్తుంటారు. చిన్నప్పటినుండి అందరికీ సన్నగా,రివటలాగా ఉన్నట్లుగానే తెలుసు.మూడనమ్మకంతో తనమంచికే పిలిచారని
ఆ పిలుపు అలవాటయిపోవటం వలన అతను కూడా ఏమీ భాదపడడు.ఇప్పుడు అతను కూడా అందరిలానే సరిపడా లావుగా ఉండి, చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటున్నాఊరు వచ్చినప్పుడు అతని ఎదురుగానే పీచాయ్ అనే మాట్లాడతారు.

No comments:
Post a Comment