Sunday 11 October 2015

శ్వాసకు ప్రాధాన్యం

                                                                   ఒకసారి గట్టిగా ఛాతీ నిండా గాలి పీల్చుకుంటే వెనువెంటనే మనకు తెలియకుండానే బోలెడంత శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది.ఎందుకంటే శ్వాస ద్వారా వెళ్ళే ఆక్సిజన్ రక్తంలో కలవటమే
ఇందుకు కారణం.అందుకే శ్వాసకు అంత ప్రాధాన్యం.మనం పనుల హడావిడిలో శ్వాస ఎలా తీసుకుంటున్నామో అసలు పట్టించుకోము.మెడ,భుజం నొప్పి,తరచుగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంటే అమ్మో!ఇంకేముంది?మనకు ఏదో జబ్బు వచ్చిందని భయపడుతూ ఉంటాము.కానీ శ్వాస సరిగా తీసుకోక ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గిపోవటం వల్ల తలెత్తే ఇబ్బందులన్నమాట ఇవి.ఊపిరితిత్తుల్లో గాలి నిండాలంటే వీపు,భుజం,మెడకండరాలు కూడా పనిచేయాల్సి రావటం వల్ల అవి బిగుసుకుపోయి నొప్పులు వస్తుంటాయి.అందుకని ఉదయం లేవగానే,పడుకునే  ముందు,వీలయినప్పుడల్లా శ్వాస మీద ధ్యాస ఉంచి ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుంటే పై సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాము. 

2 comments:

  1. శ్వాస లేనినాడు మనం లేము .అలాంటి శ్వాసని పద్ధతిలో తీసు కుంటే గుండె బాగుంటుంది . వూపిరితిత్తులు ఆరోగ్యం గా ఉంటాయి .

    ReplyDelete
  2. మీరన్నది నిజం.

    ReplyDelete