Saturday 30 November 2013

క్యూట్ గర్ల్

                                                 సృజన వాళ్ళ పాప క్యూట్ గా ఉండేది.పాప పుట్టినప్పుడు సృజనకు సిజేరియన్ చేసారు.పాపను బయటకు తీయగానే డాక్టర్ సృజనా!పాపను చూడు చాలా బావుంది అని బుగ్గ మీద తట్టి చెప్పారు.పాప తెల్లగా నల్లటి జుట్టుతో బొద్దుగా,ముద్దుగా ఉంది.సృజన బావుంది అని తలాడించింది.సృజన వాళ్ళ అమ్మ,అమ్మమ్మ పాపను చాలా నీట్ గా రకరకాల గౌనులు వేసి,అప్పట్లో అరుదుగా దొరికే అందమైన పిల్లల దుప్పట్లు వేసి ఉయ్యాలలో పడుకోపెట్టేవారు. రోజూ డాక్టర్ రౌండ్స్ కి వచ్చినప్పుడు ముద్దుగా ఉన్న పాపను ఒకసారి ఎత్తుకుని ఉయ్యాలలో పడుకోపెట్టేవారు.పాప పేరు రేష్మ అని పెట్టారు.సృజన అమ్మమ్మ మొదటి నెల దాటిన దగ్గర నుండే అత్త,తాత అని చెప్పటంతో పాటు ఎన్నో రకరకాల కబుర్లు చెపుతూ ఉండేది.ముందుగా పిల్లలు అమ్మ అనకూడదు అని అంటే అమ్మ దూరమవుతుందని పెద్దవాళ్ళు నేర్పేవాళ్ళు కాదు.పాపకు పదేపదే మాటలు చెప్పటం వలన ఐదు నెలలకే అత్త,తాత అనేది.సమిష్టి కుటుంబం కనుక రేష్మకు అన్నిమాటలు చాలాతొందరగా వచ్చినాయి.అమ్మమ్మ,తాతయ్య,జేజమ్మ,జేజితాతయ్య,మేనమామ,నాయనమ్మ,తాతయ్య,మేనత్త,అందరూ అసలు క్రింద నేల మీద  దించేవాళ్ళు కాదు.రేష్మ నాన్న ఇంట్లో ఉన్నంతసేపు రేష్మను చంకనెత్తుకుని క్రింద దించేవాళ్ళు కాదు.చిన్నప్పటి నుండి తనకు ఇష్టమయిన బట్టలు బూట్లు,చెప్పులు తనే ఎంపిక చేసుకొనేది.రేష్మ అమ్మమ్మ పట్టులంగాలు ఎక్కువగా కుట్టిస్తుండేది.రేష్మకు చిన్నతనం నుండి పట్టు పరికిణీలు అంటే చాలా ఇష్టం.రోజుకొకటి చొప్పున వేసుకుని తనకు ఇష్టమైన అరవంకీలు,పాపిట బిళ్ళ గాజులు,ఉంగరాలు,కాలికి బంగారు పట్టీలు అన్నీరోజు కొంచెంసేపు పెట్టేవరకు ఊరుకునేది కాదు.పింకీ,సోనీ అనే కుక్కపిల్లలు వెంట తిరుగుతూ ఉండేవి.నాన్నరకరకాల బొమ్మలు తెచ్చిస్తే వాటితోను,కుక్కపిల్లలతోను నవ్వుతూ,త్రుళ్ళుతూ హాయిగా ఆడుకొంటూ బాల్యాన్ని ఆనందంగా గడిపేది.

                                               


No comments:

Post a Comment