శర్వాణి చాలా అందంగా ఉండేది.వాళ్ళ ఇంటి ప్రక్కన నందిని అని బంధువులు ఉండేవారు.ఆమె చాలా నల్లగా ఉండేది.పోలికలు బానే ఉండేవి .కళ్ళు మాత్రమే తెల్లగా ఉండేవి .తల్లిదండ్రులను పోలి పిల్లలు ఉంటారు.దేముడు
ఇచ్చిన రూపాన్ని ఎవరూ ఏమీ చేయలేరు.ఈ రోజులలో అంటే ప్లాస్టిక్ స ర్జరీలతో రూపాన్ని మార్చేస్తున్నారు.
అందరితో తెల్లగా ఉంటే సరిపోయిందా నల్లగా ఉన్నాపోలికలు బాగా ఉన్న వాళ్ళే అందగత్తెలు అని చెప్పేది.నేనే అందగత్తెను అని ఆమె మా అమ్మాయి అందంగా ఉంటుందని వాళ్ళ నాన్న మాట్లాడేవారు .వాళ్ళ ఆయన కూడా వాళ్ళు బావుండలేదు వీళ్ళు బావుండలేదని అందరినీ విమర్శించేవాడు .
అందుకని ఆమెను అందరూ ఊర్వశి అంత అందగత్తె లాగావాళ్ళు ఊహించు కుంటున్నారని " ఊర్వశి"
అని పిలిచేవాళ్ళు.ఇంతకీ ఎవరూ ఆమెను విమర్శించక పోయినా చిన్న పిల్లల దగ్గరకు ఎత్తుకుంటానికి వెళ్తే
మాత్రం పిల్లలు పెద్దగా ఏడ్చేవాళ్ళు. ఫై గా పిల్లల ధగ్గరకు వెళ్ళినప్పుడు కళ్ళు పెద్దగా చేసి భయపెట్టేది.
శర్వాణి కూతురు దగ్గరకు వెళ్లి కూడా అలాగే చూస్తే ఆ పాప భయపడి ఏడ్చింది .కొంచెం పెద్ద అయ్యే వరకూ
కూడా అలాగే ఏడ్చేది.
No comments:
Post a Comment