నాగులచవితి
నాగులచవితి శుభాకాంక్షలు.నాగులచవితి సందర్భంగా ఈ యదార్ధసంఘటనను మీతో పంచుకోవాలని అనిపించింది.విజయవాడకు15-20కి.మీ దూరంలో చోడవరం అనే గ్రామం ఉంది.అక్కడ
నాగేంద్రస్వామి ఆలయం ఉంది.అక్కడ ఈ రోజు చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి.ఈరోజు ఉదయం నుండి
చుట్టుప్రక్కల ఊరిప్రజలందరూ పుట్టలో పాలు పోయడానికి వెళ్తారు.పుట్టలోబియ్యప్పిండి కొర్రలపిండి నువ్వులు
బెల్లం అరటిపండు అన్నీ కలిపి ఆవుపాలతో పుట్టలోని కలుగులో వేస్తారు.ముందుగా పుట్ట దగ్గరికి వెళ్లికలుగు
చుట్టూ నీళ్ళు చల్లి బియ్యప్పిండి చల్లి వరుసగా పసుపు,కుంకుమ వేసి పువ్వులు అలంకరించి సాంబ్రాణికడ్డిలు
వెలిగించి హారతి ఇస్తారు.తర్వాత పుట్టలోఫైన చెప్పినవన్నీమూడుసార్లు ఇంట్లోఅందరి పేర్లు,అటు ఏడు తరాలు
ఇటు ఏడు తరాలవాళ్ళవిఅని చెప్పి పాలు పోస్తారు.
ఉదయం12 గం.లకు నాగేంద్రస్వామి ఆలయం ఫైకి వచ్చిఅందరికీ దర్శనం ఇస్తారు.ఈ సమయం
కోసం భక్తులందరూ ఎంతో ఎదురు చూస్తారు.స్వామి ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఒకే సైజులోపడగ విప్పి
భక్తులందరినీఆశీర్వదిస్తారు.ఇది అద్భుతం.మేము అందరమూ ఒక సంవత్సరము వెళ్లి దర్శనం చేసుకొన్నాము.
అప్పుడు ప్రక్కన ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరము ఇలాగే12గం.లకు దర్శనం ఇస్తారు అని చెప్పారు.
ఈరోజు ఉదయం నుండిసాయంత్రం వరకూ ఎంతమంది వచ్చినాకూడా ఉచితంగా ఆవు పాలు
కావాల్సిన వాళ్ళకు ఇస్తారు.అక్కడ అందరూ స్వచ్ఛందసేవ చేయడానికి పోటీ పడతారు.ఆ ఊరివారందరూ
కూడా బంధువులను స్నేహితులను ఆహ్వానిస్తారు. స్పెషల్ బస్సులు ఆర్.టి.సి వాళ్ళువేస్తారు.సాంస్కృతిక
కార్యక్రమాలు జరుగుతాయి.నాగులచవితి రోజున కొన్ని వేల మంది స్వామి దర్సనానికి వస్తారు.అయినా కూడా
చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఈ విషయాన్నిమీ అందరితో పంచుకోవాలన్పించింది.
.

No comments:
Post a Comment