లక్మీరాజ్యం ఒక వారం రోజులు కూతురు దగ్గర ఉందామని ఊరు నుండి వచ్చింది.వచ్చిన దగ్గర నుండి పిల్లలు చెప్పినమాట వినకుండా కూతుర్ని చీటికీమాటికీ విసిగించడం గమనించింది.అమ్మమ్మ వచ్చినప్పటి నుండి తిడుతుందని పిల్లలు అభిప్రాయపడతారని నాలుగు రోజులు ఓపిక పట్టింది.ఈరోజుల్లో పిల్లలు మాట్లాడితే తిడుతున్నారనే భావనలో ఉంటున్నారు కదా!అందుకని ఒకరోజు పిల్లల్ని కూర్చోబెట్టి ఆమాట ఈమాట మాట్లాడుతూ ఏంటిరా?మరీ ఉన్నకొద్దీ మొకిరిగా తయారవుతున్నారు?అమ్మ చెప్పిన మాట వినటం లేదు.పోనీ బాగా చదువు కుంటున్నారులే అనుకోవటానికి చదువులోనూ మొకిరిగానే ఉన్నారు అంటూ తిట్ల దండకం మొదలెట్టింది.ఆవిడ మొదలెట్టిందంటే ఎదుటివాళ్ళు దండం పెట్టి పారిపోవలసిందే.అలాగే పిల్లలు అమ్మమ్మా!ఇకనుండి అమ్మ చెప్పినమాట విని చక్కగా చదువుకుంటాము అని చెబితే కానీ వదలలేదు.
No comments:
Post a Comment