మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంటుంది.అందంలో కానీ,సేవాగుణంలో కానీ,ప్రతిభ విషయంలో కానీ,ఎదుటివారికి సహాయపడటంలో కానీ ఏదో ఒక అంశం కావచ్చు.ఎందుకన్నా కానీ ఎంత మంచి వాళ్ళైనా ఎదుటివారిని పొగుడుదామని అనుకోరు.ఎదుటివారిలో ఉన్న మంచిగుణాన్ని మనసారా అభినందించగలిగినప్పుడే నలుగురిలో మనం ప్రత్యేకంగా నిలబడగలుగుతాము.అందుకే ఎదుటివారిని మనసారా అభినందించటం అలవాటు చేసుకోవాలి.
No comments:
Post a Comment