యామిని గుండ్రంగా పొత్రంలా ఉంటుంది అయినా తనే గొప్పగా,అందంగా ఉన్నాననే భావనతో అందర్నీ విమర్శిస్తూ నోటి తురుతుతో ఏదిబడితే అది మాట్లాడుతూ ఉంటుంది.అక్క కూతురి పెళ్ళి సందర్భంగా శుభలేఖ ఇవ్వటానికి రశ్మి ఇంటికి వచ్చింది.యామిని రశ్మి భర్తకు పిన్నిఅవుతుంది.రశ్మిభర్తతో ఇంతకు ముందుకన్నాఇప్పుడు చక్కగా ఉన్నావు అంది.భర్త గురించి కాస్త లావయ్యారు ఈమధ్య అంది రశ్మి.నువ్వు ఎంత లావు ఉన్నావో నీకు తెలియటం లేదు అంది రశ్మిని.రశ్మికి ఒళ్ళుమండి యామినికి కూడా తగిలివచ్చేట్లుగా అవునుగా!ఎవరిది వాళ్లకు తెలియదుగా!అన్నది రశ్మి.మళ్ళీ నోట మాట రాలేదు యామినికి.ఏమి మాట్లాడాలో తెలియక నిశబ్దంగా కూర్చుంది.
No comments:
Post a Comment