నగేష్ చూడటానికి నెమ్మదిగా ఉన్నట్లు కనిపించినా సకల దుర్గుణాభిరాముడు.ఒక్కటి కూడా మంచి లక్షణం అంటూ లేదు.ఈమధ్య కొత్తగా నేర్చుకున్నదేమిటంటే ఊళ్ళో కొత్త బైక్ ఎక్కడ కనపడితే అక్కడే దాన్నితీసుకెళ్ళి అమ్మేసుకోవటం మొదలుపెట్టాడు.వాళ్ళు వచ్చి ఇంటి మీద పడితే తండ్రి డబ్బులు కట్టటం అలవాటై పోయింది.తాజాగా ఒకళ్ళు దొంగతనం కేసు పెడితే పారిపోయాడు.తండ్రి వెతికి పట్టుకొచ్చికేసు మాఫీ చేసుకుని ఇంట్లో పెట్టి బయట తాళం పెట్టాడు.ఇంకెవరికీ అలవికాడని తనే స్వయంగా బోజనంతోపాటు మిగిలిన అవసరాలు అంటే మందు వగైరా చూస్తున్నాడు.అయినాసరే తండ్రి కళ్ళు కప్పి స్నానాలగదిలో ఉన్న వెంటిలేటర్ ద్వారా ఇంట్లో నుండి బయటకు దూకి పారిపోయాడు.అన్నిపక్కలా ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియలేదు.
No comments:
Post a Comment