శివాని కి మొక్కలంటే ప్రాణం.తను ఉండే ప్రదేశంలోకన్నా కడియం వెళ్ళి తెచ్చుకుంటే ఎక్కువ మొక్కలు తక్కువరేటుకు వస్తాయన్న ఉద్దేశ్యంతో వెళ్ళింది.ప్రయాణ బడలిక తప్ప ఉపయోగం లేకుండా పోయింది.స్వంత ఊరిలో హైబ్రిడ్ గులాబీ మొక్క 50 రూ.లకు అమ్ముతుంటే కడియంలో 150 రూ.లు పెట్టి తెచ్చింది.ప్రత్యేకమైన మొక్క కాబోలు ఎన్నోపువ్వులు పూస్తుందనుకుని తెస్తే నెలకు ఒక్క పువ్వు కూడా రావటం లేదు.ఊరిలో కొన్న మొక్క నిండుగా విరగ పూస్తుంటే కడియం మొక్క దిష్టి బొమ్మలాగ దాని పక్కనే ఉంది.కడియం వెళ్ళాను కదా అని వేల రూ.లు పెట్టి అన్ని రకాల మొక్కలు కొనుక్కొచ్చింది.ఉన్న ఊరిలో మొక్కలు కొనుక్కోక "దూరపు కొండలు నునుపు"అని దగ్గరకు వెళ్తేగానీ ఎత్తుపల్లాలు తెలియవన్నట్లుగా అయింది శివానీ పరిస్థితి.ఎడారి మొక్క నచ్చిందని అడిగితే 600 రూ.లు చెప్పి మా సారు లేరు ఇప్పుడు అమ్మడం కుదరదు అన్నాడు.మరి ఎందుకు పెట్టుకున్నట్లో? ఫొటోలలో అందమే కానీ అక్కడ అనుకున్నంత గొప్పగా ఏమీ లేదని,అంత దూరం శ్రమపడి వెళ్ళడం డబ్బు కూడా వృధా అని శివానీకి,వెంట వెళ్ళిన వాళ్ళకు అనిపించింది.
No comments:
Post a Comment