Wednesday 19 February 2014

మిరపకాయల సుబ్బయ్య

          జ్యోతిర్మయి ఊరిలో సుబ్బయ్య అని ఒకతను ఉండేవాడు.అతను ఒకసంవత్సరం పొలంలో మిరపపంట వేశాడు.మిరపకాయలు విరగకాసి బాగాలాభం వచ్చింది.అందుకని అతన్నిమిరపకాయల సుబ్బయ్య అంటారు.
ఎవరయినా క్రొత్తవాళ్ళు ఊరిలోకొచ్చిసుబ్బయ్య ఇల్లెక్కడ?అని అడిగితే ఎవరికీ తెలియదు.మిరపకాయల సుబ్బయ్య ఇల్లెక్కడ?అంటే చెప్పేవాళ్ళు.సుబ్బయ్య 6 1/2అడుగులు ఎత్తు,ఒకకన్ను లొట్టపోయి ఒకకన్నుతో  ఉండేవాడు.పొడవుకుతగినలావుతోబలంగా,మొద్దులా ఎప్పుడూఏదోఒకటి తింటూ,తాగుతూ  
ఉండేవాడు.పాదాలు పెద్దగాఉండేవి.చెప్పులు దొరికేవికాదు.పైగా పిసినారి.డబ్బులుఎక్కువపెట్టి కుట్టిన్చుకోవాల్సి
వస్తుందని చెప్పుల వాళ్ళతో కుట్టించుకునేవాడు కాదు.ఎండలో,వానలో అలాగే చెప్పులులేకుండా  తిరిగేవాడు.ఇతనిలోఉన్నమంచిగుణంఇతరులకు సహాయపడటం.ఇతనిలో ఉన్న దుర్గుణం
ఏమిటంటే ఊరిలో ఎవరికి మంచి సంబంధాలు వచ్చినా దారిలో కాపుకాచి మరీ వాళ్ళకారులోఎక్కి వీళ్ళమీద ఉన్నవి లేనివి అబద్దాలు చెప్పేవాడు.కొంతమంది నమ్మి నిజమేనేమో వాళ్ళఊరివాడే చెప్పాడుకదా!అనుకొనేవాళ్ళు.
 కొంతమంది మీఊరి పొడుగువాడు మాకు మీగురించి ఇలాచెప్పాడు అయినామేము పట్టించుకోలేదుఅని పెళ్లి
ఖాయపర్చుకోనేవాళ్ళు.ఇక ఊరిలో ఏసంబంధంచెడిపోయినా మిరపకాయల సుబ్బయ్యపనే అని తిట్టేవాళ్ళు.
ఒకసారి పొరుగూరివాళ్ళు ఇంటిమీదకొచ్చి పిచ్చికొట్టుడు కొట్టారు.ఊరిలోవాళ్ళు పోనీలే అని వదిలేసేవాళ్ళు.ఇక
అప్పటినుండి సంబంధాలు చెడగొట్టే అలవాటు కాస్త తగ్గించుకొన్నాడు.

No comments:

Post a Comment