Thursday 20 February 2014

తలుపులమ్మ

     లలిత ఊరు తునిదగ్గర రాజంపేట.ఆఊరిలో తలుపులమ్మ కొండపై కొలువై ఉంది.లలిత చిన్నప్పుడు ఇంకా అక్కడ గుడి కట్టలేదు.ఇప్పుడు చక్కటి గుడికట్టి చుట్టుప్రక్కల  అంతాబాగా అభివృద్ధి చేశారు.అప్పట్లో పగలు మాత్రమే గుడికి వెళ్ళేవాళ్ళు.సాయంత్రం అయితే కొండపైకి వెళ్ళేవాళ్ళు కాదు.అమ్మవారు
 రాత్రి కొండపై తిరుగుతుంటారని ప్రతీతి.ఒకసారి ఒకచంటిపిల్లను కొండపై మర్చిపోయి హడావిడిలో
కొండదిగి వచ్చారట.సాయంత్రంఅయింది కనుక మీరుపైకి వెళ్లొద్దు పిల్లను అమ్మవారే చూసుకొంటారు మీరు
కంగారుపడవలసిన పనిలేదు అని చుట్టుప్రక్కలవాళ్ళు చెప్పారట.వాళ్ళు అమ్మవారిమీద భారంవేసి ఆమెనుప్రార్ధిస్తూ క్రిందవుండి పోయారట.ఉదయమే కొండపైకి వెళ్లి చూసేసరికి చంటిపిల్ల అమ్మవారి ఒడిలో
ఆడుకొంటూ పాలు తాగుతుందట.పిల్లతల్లిదండ్రులు అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపి వేనోళ్ళప్రార్దించి పిల్లను తెచ్చుకున్నారట.లలితను కూడా చిన్నప్పుడు ఒకసారి కొండపైన మర్చిపోయి క్రిందికిదిగివచ్చారట.కొంతదూరం
వచ్చినతర్వాత పిల్లలేదని గబగబా కొండపైకి వెళ్లి తెచ్చుకున్నారట.తలుపులమ్మ అనేపేరు పెట్టుకున్నారట.
తర్వాత లలితగా పేరు మార్చారట.మాఊరి తలుపులమ్మ తల్లి చాలా మహిమ కలదిఅని లలిత చెప్పింది.

No comments:

Post a Comment