Friday 28 February 2014

కుక్క బిస్కట్లు

       చారుమతి తృణధాన్యాలతో తయారుచేసిన వివిధరకాల ఉత్పత్తులను ప్రజలకు తెలియపరచటం కోసం
ఒకప్రదర్శనలో పెట్టింది.తన ముఖ్యోద్దేశం ఏమిటంటే రాగులు,జొన్నలు,సజ్జలు,కొర్రలు,అవిసెగింజలు మున్నగు
వాటితో తయారుచేసిన ఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కనుక దైనందినజీవితంలో వాటినిఎలా
రకరకాల రుచికరమైన ఆహారపదార్దాలుగా తయారుచేసి తినవచ్చో తెలియచెప్పటం.ఈరోజుల్లో ఎక్కువమంది
జిహ్వచాపల్యం వల్లఫాస్ట్ ఫుడ్ ఇష్టపడుతున్నారు కనుక ఐదునక్షత్రాల హోటళ్లకు పరుగులు తీస్తున్నారు.
పెద్దవాళ్ళే పిల్లలకు అలవాటుచేస్తుంటే ఇక పిల్లలగురించి చెప్పేదేముంది.పెద్దలేఆరోగ్యానికి ప్రాముఖ్యతఇవ్వటం
లేదు.పిల్లలకేంతెలుస్తుంది?అన్నిఉత్పత్తులతోపాటు చారుమతి మిల్లెట్ బిస్కట్లు కూడా పెట్టింది.ఇద్దరు పిల్లలు
రోజుకొకసారి వచ్చి ఈబిస్కట్లు ఎంత అనిఅడిగి వెళ్తున్నారు.ఒకరోజు ఇంకోఇద్దరిని తీసుకొచ్చి బిస్కట్లు చూపించి
ఇదిగో ఇవి కుక్క బిస్కట్లు అని చెప్తున్నారు.వాళ్ళు వాటిరుచి కూడాచూడలేదు.అయినా మాట్లాడుతున్నారు.
మామూలుబిస్కట్లు ఐదురూపాయలకే దొరుకుతున్నాయి.ఇవిఖరీదు ఎక్కువకనుక కొనలేకతినాలన్పించిఅలా
చెప్పాడో అర్థంకాలేదు.అయినా ఆరోగ్యానికి ఉపయోగపడేవి క్రీంబిస్కట్లంత రుచిగా లేకపోయినా కుక్క బిస్కట్లు
అనటం ఏమిటో?పిల్లలు అలా తయారయిపోతున్నారు పితపకాలపు బుద్దుల్లాగా అని చారుమతి అనుకొంది.

No comments:

Post a Comment