Friday 28 February 2014

ఏనాటి ఋణానుబంధమో

         శ్రీజ అమ్మవాళ్ళఇంట్లో ఆవులు,ఎద్దులు,గిత్తలు మేలిరకానికి చెందినవి ఉంటాయి.గోమాతలో ముక్కోటి
దేవతలు ఉంటారు కనుక దొడ్లోపెంచితే ఏదోషాలున్నాతొలగిపోతాయని చెప్పటంవలన పెంచటం మొదలుపెట్టారు.
శ్రీజ తమ్ముడికి కూడా మేలిరకం ఆవుల్ని,గిత్తల్ని పెంచటం సరదా.విదేశీయులు వచ్చిచూచి వాటితో ఫోటోలు
తీసుకుంటూఉంటారు.వాటికి ప్రత్యేకంగా షెడ్లువేసి పంకాలు పెట్టి,సేవకులనుపెట్టి జాగ్రత్తగా చూచుకొంటారు.
ఆవులప్రదర్శనలో అందాలపోటీల్లో బహుమతులు వస్తుంటాయి.వీళ్ళింటికి రెండిళ్ళఅవతల జగదీష్అనినాలుగు
సంవత్సరాలఅబ్బాయి ఉంటాడు.వాడికి నడకవచ్చిన దగ్గరనుండి ఆవులషెడ్డు దగ్గరకువచ్చిఆవుల్నిచూచి   వెళ్తుంటాడు.ఎప్పుడైనా పాలేళ్ళురావటం లేటయితే ఆత్రుతపడి ఇంతపొద్దెక్కినా ఏంచేస్తున్నారో?తొందరగా
రావాలనితెలియదా?వాటికి దాణాపెట్టటం,నీళ్ళుపెట్టటం లేటయింది అయ్యో!ఆవులకు ఇంతవరకుఏమీపెట్టలేదు
ఆలస్యమయిందని హడావిడి పడిపోతుంటాడు.పదిసార్లు ఏమిచెయ్యాలోతోచక ఇంటికి,షెడ్డుకితిరుగుతుంటాడు.
ఎవరోఒకళ్ళువచ్చి వాటిపనిచూస్తేగాని వీడు స్థిమితపడడు.నిద్రలోఆఆవుకు మేతవెయ్యాలి,ఈఎద్దుకినీళ్ళు
పెట్టాలి అంటూ ఉంటాడని వాళ్ళఅమ్మ చెప్తూఉంటుంది.మధ్యమధ్యలోవచ్చి పనివాళ్ళు సరిగ్గాచేస్తున్నారోలేదో
తనిఖీచేసి వీళ్ళింటికివచ్చి చెప్పివెళ్తుంటాడు.ఏనాటి ఋణానుబంధమో అన్నిసార్లువెళ్లొద్దనిచెప్పినావినకుండా
మీఇంటికి షెడ్డుకి తిరుగుతుంటాడని అందరూ అంటూఉంటారు.  

No comments:

Post a Comment