Sunday 23 February 2014

దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు

       రితిష బంధువులలో ఒకాయన కుటుంబంతో అమెరికానుండి మాతృదేశమైన భారతదేశానికి వచ్చాడు.
వచ్చేటప్పుడు అమెరికాలోమంచు బాగాఉండటంవలన విమానం బయలుదేరుతుందో లేదో తెలియని పరిస్థితి.
ప్రయాణం మానుకోవలసి వస్తుందేమోనని ఆదుర్దా పడవలసి వచ్చింది.ఎలాగయితే మంచులో ఇబ్బందిపడి
విమానాశ్రయానికి వచ్చి విమానయానం చేసి అలసిపోయి మాతృదేశానికి వచ్చారు.రితిష ఇంటిలో ఒకరోజు
విశ్రాంతి తీసుకుని స్వగ్రామానికి వెళ్దామని బయలుదేరారు.దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంవలన ఆలస్యంగా
విమానాశ్రయానికి చేరుకున్నారు.తనిఖీ చేయవలసిన సామాన్లు ఎక్కువగా ఉండటంవలన విమానం వెళ్ళటానికి
అరగంట మాత్రమే ఉన్నందున లోపలకు అనుమతించలేదు.విమానం బయల్దేరి వెళ్ళిపోయింది.తర్వాత విమానానికి మళ్ళీటిక్కెట్లు కొనుక్కుని నాలుగుగంటలు ఎదురుచూసి బయల్దేరారు.వాళ్ళసిటీలోవర్షంపడిన
కారణంగా విమానం క్రిందికి దిగటానికి వెంటనే అనుమతి ఇవ్వలేదు.గంటసేపు పైనే చక్కర్లు కొట్టాడు.విమానంలో ఇంధనం 25%మాత్రమే మిగిలిఉంది.ఇంధనం అయ్యేలోపు అనుమతి ఇస్తేసరే వెనక్కు వెళ్ళటమో లేదా అత్యవసరంగా వాగుల్లోనయినా,ఎక్కడంటే అక్కడ దిన్చేస్తాముఅని ప్రకటించాడట.అందరూ భయపడ్డారట.
ఇలా జరుగుతుందేమిటి?ప్రయాణమంతా ఇబ్బందికరంగా,ఎప్పుడు ఏమిజరుగుతుందో తెలియని పరిస్థితిలాగా,దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు లాగా ఉంది అనుకొన్నారట.     

No comments:

Post a Comment