Thursday 27 February 2014

తిరణాల

                                                         విజయవాడకు 10-12కి .మీ దూరంలో కృష్ణానదీతీరాన యనమలకుదురు అనే గ్రామం ఉంది.అక్కడ మహాశివరాత్రి సందర్భంగా పెద్దతిరణాల జరుగుతుంది.నెలరోజుల ముందునుండే హడావిడి మొదలవుతుంది.ఇందులో ప్రత్యేకఆకర్షణ ప్రభలు.ముందుగా గ్రామప్రభ బయలుదేరుతుంది.తర్వాత పెద్దపెద్ద ప్రభలు ఊరేగింపుగాచుట్టుప్రక్కల ఊళ్ళనుండి,సిటీనుండి వస్తాయి.తెల్లవారుజాము నుండే ఎద్దులను స్థానికులు,ప్రక్క ఊర్లవాళ్ళు గులాముచల్లి,అందముగా అలంకరించి కొండచుట్టూ గిరి ప్రదక్షిణ చేయిస్తారు.పెద్ద కొండమీద గుడి ఉంటుంది.మొదట్లో కొండపైకి వెళ్ళటానికి దారికూడా సరిగ్గా ఉండేదికాదు.అయినా చాలాదూరం నుండికూడా ప్రజలు తండోపతండాలుగా తిరణాలకు వచ్చేవారు.ఇప్పుడు ఘాట్ రోడ్డువేసి కొండపైన బాగా అభివృద్ధిచేసారు.పూర్వం శివాలయం ఒక్కటే వుండేది.ఇప్పుడు ఉపాలయాలు వేరుగా కట్టారు.శివాలయంలో ప్రతిరోజు 11రకములతో అంటే పంచామృతాలతో,పండ్లరసాలతో.వీభూదితో రుద్రాభిషేకాలు చేస్తారు.శివరాత్రినాడు రాత్రి ఒంటి గంటనుండే అభిషేకాలు చేయడం మొదలెడతారు.సుదూర ప్రాంతాల  నుండి ప్రజలు  దైవ దర్శనం   చేసుకోవటానికి వస్తూ వుంటారు. కనుక ఆరోజు దైవ దర్శనానికి  చాలా సమయం వేచి ఉండవలసి వస్తుంది.అయినా అందరూ ఎంతో ఓపికగా స్వామి దర్శనం కోసం బారులు తీరతారు.ఆరోజు ఆర్.టి.సి బస్సులు ప్రత్యేకంగా వేస్తారు.ఎక్కడెక్కడినుండో జనం ఎన్నోవ్యయప్రయాసలకోర్చి ఈతిరణాలకు,స్వామిదర్శనానికి వస్తారు.ఇసుకవేస్తే రాలనట్లుగా ఉంటుంది.మూడు రోజులపాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.శివపార్వతుల కళ్యాణం చూడటానికి ఎంతో మంది వస్తారు.చిన్నవ్యాపారులందరూ  కొండచుట్టు రకరకాల వస్తువులు,బొమ్మలు అమ్ముతుంటారు.ఆఊరి వారందరూ వారివారి బంధువులను,స్నేహితులను ఆహ్వానిస్తారు.ఆ ఊరివాళ్ళు దూరప్రాంతాల నుండి కూడా శివరాత్రికి తప్పకుండా వస్తారు.ఇది చూడటానికి రెండుకళ్ళు చాలావనిపిస్తుంది.ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు.చేయలేనివాళ్లు దైవదర్శనం చేసుకుంటారు.

                                    నా బ్లాగ్ వీక్షించవచ్చిన వారందరికి శివరాత్రి శుభాకాంక్షలు.

No comments:

Post a Comment