Sunday 5 April 2015

ఆనందంగా జీవితం

                                                               ఆనందంగా జీవితం గడపాలంటే శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.అలా ఉండాలంటే ముందు ఈ చిట్కాలు పాటించాలి.హాయిగా నవ్వండి.ఎదుటివారిని పలకరించేటప్పుడు నవ్వుతూ పలకరిస్తే వాళ్ళు కూడా దాన్నే అనుసరిస్తారు.నవ్వడంవల్ల మానసిక ఆనందం కలుగుతుంది.ఉన్నంతలో తాజాగా,అందంగా కనిపించాలంటే సరిపడా నిద్ర పోవాలి.తక్కువనిద్ర పోవడంవల్ల వయసుకన్నా పెద్దగా కనిపిస్తారు.చిన్నవయసులోనే ముఖంపై ముడతలు,మచ్చలు వంటి సమస్యలు ఎదురవుతాయి.వేళకు నిద్రపోతే అలసిన మనసుకి హాయిగా ఉంటుంది.సహజ సౌందర్యంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.పచ్చటి మొక్కల మధ్య కాసేపు తిరిగి వీలయితే తోటపని చేయండి.మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది.సానుకూల ధృక్పదంతో ఆలోచిస్తే సమస్యలు చాలావరకు తగ్గుతాయి.కుదిరినప్పుడల్లా సేవచేయండి.వీలయినప్పుడల్లా చేతనైనంతవరకు సేవ అంటే దైవసేవ కావచ్చు లేదా మానవ సేవ కావచ్చుఏదైనా సేవచేయడంవల్ల మనసుకుసంతోషంగా,సంతృప్తిగాఉండి ఆరోగ్యంగా,ఆనందంగా ఉంటారు.హాయిగా ఉన్నంతలో తృప్తిగా,సంతోషంగా ఉండటం అలవాటుచేసుకుంటే ఆనందకర జీవితం మన స్వంతమవుతుంది. 

No comments:

Post a Comment