జేత్ర తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు.గారాబంతో మొండిగా తయారయింది.చిన్నప్పటినుండి ఏది కావాలంటే అది చేసిపెట్టటమో లేదా తెచ్చిఇవ్వటం వలనో బాగా ఒళ్ళు వచ్చేసింది.పెళ్ళి వయసు వచ్చిందని జేత్రకు పెళ్ళి చేశారు.ఒక అమ్మాయి పుట్టింది.ఇంకా ఒళ్ళు వచ్చేసి ముప్పై సంవత్సరాలకే గుండెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.కూతురుకు ఆపరేషన్ చేశారని తల్లి వచ్చింది.తల్లి చేసే ప్రతి పనికి వంకలు పెట్టటం మొదలెట్టింది.ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టుకుని తల్లి మూతి మీద గట్టిగా కొట్టేసరికి వాచిపోయింది.తల్లి ఉన్నన్ని రోజులు చీటికీమాటికీ కొట్టేసేది.పిన్ని కొడుకు వస్తే వాడిని కొట్టింది.ఇంటికి వెళ్ళిన వాళ్ళకు తల్లీకూతుళ్ళుఇద్దరు చెరో పక్కా కూర్చుని చెప్పటం మొదలెట్టారు.ఒక్కగానొక్క కూతురని వస్తే కొడతందని తల్లి,నేను కొట్టలేదని కూతురు చెప్తుంటే దెబ్బ కనడుతుంది కనుక తప్పు తల్లిని కొట్టకూడదు అని చెపితే మధ్యలో వెళ్ళిన వాళ్ళను కొట్టేస్తుందేమోనని భయపడి వెళ్ళటం మానేశారు.తల్లి కొట్టేకూతురు దగ్గర నేను ఉండలేనని తన ఇంటికి వెళ్ళిపోయింది.పనివాళ్ళతో,ఇరుగుపొరుగుతో జేత్ర బాగానే ఉంటుంది.తల్లి,ఆమె తరఫువాళ్ళతో మాత్రమే ఇలా ప్రవర్తిస్తుంది.తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఆమె విలువ తెలిసి వచ్చింది.అమ్మ ఎంతో ప్రేమగా అన్నీ చేసిపెడుతుంటే తెలియలేదు.అయ్యో!అమ్మ ఉన్నన్ని రోజులు వేపుకు తిని పిచ్చిపనులు చేశాను అని జేత్ర పశ్చాత్తాపపడింది.అమ్మ ఇక ఎప్పటికీ నీదగ్గరకు రాను అని విరక్తి పుట్టి వెళ్ళిపోయింతర్వాత ఇప్పుడు అనుకుని ఏమి ఉపయోగం? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.ఆపరేషన్ చేసినప్పుడు తేడా వచ్చి అతిప్రేమను భరించలేక పోయేదాన్నని,తన తప్పు కప్పిపెట్టుకోవటానికి కనిపించిన వాళ్ళందరికీ చెప్పటం మొదలెట్టింది.
No comments:
Post a Comment