Wednesday, 16 March 2016

సహజ క్లెన్సర్

                                                          మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి ముఖం కాంతి విహీనంగా కనిపిస్తుంటుంది.అలాంటప్పుడు మార్కెట్లో దొరికే ఏదో ఒక క్రీమ్ రాసుకునే కన్నా ఇంట్లోనే సహజంగా ఉండే వాటితో తేలిగ్గా ఎటువంటి ఇబ్బందులు(సైడ్ ఎఫెక్ట్స్) రాకుండా చేసుకోవచ్చు.ముఖంపై వాతావరణ కాలుష్యం వల్ల మనకు తెలియకుండానే మురికి పేరుకుంటుంది.దీనితో చర్మం కాంతి విహీనంగా మారుతుంది.కనుక అప్పుడు ఒక పండు టొమాటో సగానికి కోసి రెండు భాగాలుగా చేసి  ఒకదానికి పంచదారను అద్ది ముఖంపై రుద్దితే నలుపుదనం తగ్గి ముఖం కాంతివంతంగా ఉంటుంది.మిగిలిన సగ భాగంపై కూడా పంచదార వేసి మెడ,చేతులు కూడా రుద్దితే చర్మం తెల్లగా.అందంగా తయారవుతుంది.టొమాటో సహజ క్లెన్సర్ అన్నమాట.

No comments:

Post a Comment