Wednesday 2 March 2016

వినూత్న పర్యావరణ పరిరక్షణ

                                                                వేసవికాలంలో మనకు మార్కెట్లో రకరకాల పండ్లు దొరుకుతాయి కదా!నేరేడు,మామిడి,పనస,పంపరపనస,ఈత,సపోటా,ఉసిరి,రాతి ఉసిరి మొదలైన పండ్లు మనం తిన్న తర్వాత గింజలు పడేస్తుంటాము. ఇకమీదట అలా బయటా పడేయకుండా వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడిలేకుండా ఒక సంచిలో వేసి కారులో కానీ,మరేదైనా వాహనంలో గానీ పెట్టుకుంటే దూరప్రయాణం చేసేటప్పుడు వాటిని దారిలో చల్లుకుంటూ వెళుతుంటే వర్షాలు పడగానే అవి మొలకెత్తుతాయి.అవి పెరిగి పెద్ద చెట్లు అయిన తర్వాత చక్కటి గాలిని అందివ్వడంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ  భావితరాలకు పండ్లను అందిస్తాయి.ఈ వినూత్న ఆలోచన వల్ల భావితరాలకు ఎంతో మేలు చేయటమే కాక పర్యావరణాన్ని కాపాడటంలో మన వంతు సహాయం అందించిన వాళ్ళం అవుతాము.చెమటోడ్చి పనిచేయాల్సిన అవసరం లేదు కనుక మనందరమూ కూడా ఈ వినూత్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాలుపంచుకోగలిగితే ధన్యులము.

No comments:

Post a Comment