Saturday, 26 March 2016

ఇంట్లోనే ఓ.ఆర్.ఎస్ తయారీ

                                                            మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి.వాతావరణం మార్చి నెలా? లేక మే నెలా?అన్నట్లుగా ఉంటుంది.ఒకటే దాహం.పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చల్లటి నీళ్ళు గ్లాసుల కొద్దీ తాగే స్తుంటారు.అలా అని నీళ్ళు అదే పనిగా తాగకూడదు.వడ దెబ్బ తగలకుండా మంచి నీళ్ళతో పాటు కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ రసం,ఉప్పు,పంచదార కలిపిన నీళ్ళు తాగాలి.దాహం వేసిందని కూల్ డ్రింకులు,పాకెట్ల నీళ్ళు అసలు తాగకూడదు.బయటకు వెళ్ళే ముందు ఇంట్లోనే ఓ.ఆర్.ఎస్ ద్రావణం తయారు చేసుకుని ఒక సీసా వెంట తీసుకు వెళ్ళాలి.అదెలా అంటే ఒక లీటరు చల్లటి మంచి నీళ్ళు,ఆరు స్పూనుల పంచదార,ఒక అర స్పూను ఉప్పు బాగా కలిపితే  ఈ ద్రావణం తయారు అవుతుంది.దాహం వేసినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది.    
   

No comments:

Post a Comment