Monday 28 March 2016

వేసవిలో ఆహారం

                                                                వేసవికాలంలో ఎండల నుండి ఉపశమనం పొందేందుకు ఆహారంలో కూడా ప్రత్యేకమైన మార్పులు చేసుకోవాలి.మనందరికీ తెలిసినవే అయినా ఒక పద్దతిగా పాటిస్తే వేసవిలో తలెత్తే ఇబ్బందులు నుండి తేలికగా బయటపడవచ్చు.దాహార్తి తీర్చుకోవటానికి ఫ్రిజ్ లోని ఐస్ నీళ్ళ కన్నా కుండలోని చల్లటి నీళ్ళు తాగటం శ్రేయస్కరం.చల్లటి నిమ్మకాయనీళ్ళు,ప్రత్యేకంగా కరివేపాకు,పచ్చిమిర్చివేసి తయారుచేసిన చల్లటి నిమ్మకాయ మజ్జిగ,నిమ్మరసం,చెరుకు రసం,కొబ్బరి నీళ్ళు,సబ్జా గింజల నీళ్ళు,బార్లీ నీళ్ళు,ఎండు కర్జురాలు నానబెట్టిన నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.వాటితోపాటు నీటిశాతం ఎక్కువగా ఉన్నపండ్లు,కూరగాయలు తినాలి.పుచ్చకాయ,ద్రాక్ష,బత్తాయి,కర్భూజ,సపోటా,అనాస,తాటిముంజెలు,జామ,బొప్పాయి,వాటర్ యాపిల్,ఈత కాయలు ఖర్జూరకాయలు,యాపిల్ వంటివి ఎక్కువగా తినాలి.నీటిశాతం ఎక్కువగా ఉన్నకీరదోసకాయ,ఒకరకమైన తినే దోసకాయ,కారట్,టొమాటో వంటి కూరగాయలతో చేసిన సలాడ్లు, రకరకాల పండ్లతో చేసిన సలాడ్లు,తాజా పెరుగుతోతయారుచేసినవి,సొర,బీర,దోస,ఉల్లిపాయ,కాబేజ్,కాలిఫ్లవర్,వంకాయ,టొమాటో,పొట్లకాయ,ఆకుకూరలు కూరగాయలతో చేసిన పదార్ధాలు ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి.వేసవికాలం ఎక్కువగా పాలు పోసిన కూరలు,కలగలుపు కూరలు,పులుసు కూరలు,పచ్చి పులుసు,రకరకాల చారులు  వంటి వాటితో తేలికపాటి ఆహారం తీసుకోవాలి.వీటితో పాటు తప్పనిసరిగా రోజుకొక అరటిపండు కూడా తినడం మాత్రం మర్చిపోకూడదు.ఈవిధంగా చేస్తే వేసవిలో భుక్తాయాసంతో ఆపసోపాలు పడకుండా హాయిగా ఉండొచ్చు.

No comments:

Post a Comment