Friday 4 March 2016

బిట్టుగాడు

                                                             నందిత చిన్ననాటి స్నేహితురాలు నందిని చాలా సంవత్సరాల తర్వాత విజయ రాజరాజేశ్వరి దేవి గుడిలో కనిపించింది.చాలాకాలం తర్వాత కనిపించారు కనుక అమ్మవారి దర్శనం అయిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకుందామని ఒక ప్రక్కన కూర్చున్నారు.కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఒక అరగంట చిన్ననాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నాక పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే ఎంతవరకు మా బిట్టుగాడు అలా మా బిట్టుగాడు ఇలా అంటూ మా బిట్టుగాడు ఉన్నంతసేపు ఎవరినీ ఇంటికి రానివ్వడు అంటూ వసపిట్టలా చెప్తుంది.ఇక్కడకు తీసుకురాకపోయవా?అంటే గుడికి తీసుకుని రాకూడదు కదా!అంది.ఎందుకని?అని ఆశ్చర్యంగా అడిగింది నందిత.ఇంతకీ బిట్టుగాడు అంటే  మా ప్రియాతి ప్రియమైన  పెంపుడు కుక్క.మా అబ్బాయి వేరే రాష్ట్రంలో చదువుకుంటున్నాడు.ఇందాకటి నుండి బిట్టుగాడు అంటే మా అబ్బాయనుకున్నావా?మా అబ్బాయి కన్నా ఎక్కువే అనేసింది నందిని.

No comments:

Post a Comment