Wednesday 8 July 2015

సంపూర్ణ ఆరోగ్యం కోసం వెళ్తే ...........

                                                         సులోచన ఆరోగ్యంగానే ఉన్నాముందుముందు ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో
ఉండటం కోసం యోగా దినోత్సవం సందర్భంగా తరగతులు పెడితే యోగాసనాలు నేర్చుకుందామని  వెళ్ళింది.మొదటి రోజునే నేర్పటానికి వచ్చిన యోగా గురువు అన్ని ఆసనాలు ఒకదాని తర్వాత  ఒకటి వెంటవెంటనే వేయించారు.ఇంటికి వచ్చిన తర్వాత సులోచన రోజంతా నిద్రపోతూనే ఉంది.సాయంత్రం అయ్యేటప్పటికి ఎడమచెయ్యి భుజం దగ్గరనుండి మోచేతి మధ్యలో మెలితిప్పినట్లు నొప్పిగా ఉంది.నొప్పి తగ్గటానికి నొప్పి మందు   వేసుకుంది.పదిరోజులైనా తగ్గలేదు .చెయ్యి మొత్తంనొప్పి వచ్చింది.వైద్యులు కండరం బెణకటం వల్ల నొప్పివచ్చిందని చెప్పారు.పరిక్షలకుగానీ,మందులకుగానీ నాలుగువేలు వదిలించుకుని సులోచన ఇంటికి వెళ్ళింది.15 రోజులతర్వాత కూడా తగ్గకపోతే వేరే పరీక్ష చెయ్యాలని చెప్పారు.యోగా మాట దేముడెరుగు అప్పటినుండి ఇప్పటికి నానా తిప్పలు పడాల్సి వస్తుందని సులోచన బాధపడింది.
సూచన:శరీరానికి అసలు వ్యాయామం లేనివాళ్ళు మొదట నిదానంగా నేర్చుకోవాలి కానీ హడావిడిగా ఒక్క రోజులో ఏదో చేద్దామని  వెళ్ళకూడదు.సులోచన లాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది.జాగ్రత్త  సుమా!

No comments:

Post a Comment