Sunday 12 July 2015

నిలువుదోపిడీ

                                                                   భారతి కొంచెం ఎడమచేయి లాగుతుందని ఎందుకైనా మంచిది అని 
గుండె వైద్యుని దగ్గరకు వెళ్ళి అన్ని పరిక్షలు చేయించుకుంటే బాగుంటుందని వెళ్ళింది.గుండె నొప్పి లేదు కనుక అది మామూలు నొప్పి అంటూనే అన్ని పరిక్షలు చేయించమని చాంతాడంత పట్టిక రాసిచ్చాడు.అది తీసుకుని కొన్నివేల రూపాయలు సమర్పించి వెళ్తే అక్కడ చేసే నిపుణులు లేరన్నారు.ఒకటి చేసి ఒకటి చెయ్యకుండానే చెయ్యవలసినవి ఇంతే అని చెప్పారు.ఎంతోకొంత తెలుసు కనుక అన్ని పరిక్షలు చెయ్యలేదేమిటి?అంటే దానిలోనే  అంతా తెలుస్తుంది అన్నారు.దానిలోనే తెలిసేట్లయితే విడిగా ఎందుకు డబ్బు తీసుకోవటం జనాలను దోచుకుతినటం కాకపోతే. వైద్యుడ్ని అమాయకంగా అడిగినట్లుగా ఫలానా పరిక్ష ఇంకో దానిలో తెలుస్తుందని చెప్పి చెయ్యలేదు అని అంటే అవునవును దీనిలోనే తెలుస్తుంది అంటూ ఆయన కూడా తప్పు కప్పిపుచ్చాడు.ఇది వేరు అదివేరు అన్న విషయం వీళ్ళకు తెలుసు.అంతకన్నాగట్టిగా మాట్లాడినా ప్రయోజనం ఉండదు కనుక అడగలేదు..అన్ని ఆసుపత్రుల పరిస్థితీ అదే.చివరకు ఏమీలేదు రోజూ వ్యాయామం చెయ్యండి అని సలహా ఇచ్చాడు.ఆమాట మొదటే చెప్తే డబ్బు రాదుగా!అందుకే సగం పిండిన తర్వాత చెప్పటం.ఇంకానయం ఇతను కొంతలో కొంత మెరుగు.బుట్టెడు మందులు రాయలేదు అందుకు సంతోషపడాలి.అవసరం ఉన్నా లేకున్నా మందులు రాయటం ఈనాటి ఫ్యాషన్.అవి మింగి లేనిపోని రోగాలు కొనితెచ్చుకోవటం.ఖర్మ కాలి గుండెకు ఏదైనా తేడా ఉందా!వాళ్ళ పని అయిపోయినట్లే.ఆసుపత్రిలో నిలువు దోపిడీనే.ఇది ఈనాటి పరిస్థితి.

No comments:

Post a Comment